వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ప్రాధాన్యం ఉండబోదు – తన మనసులో మాటను బయటపెట్టిన కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి షాక్‌ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని విూడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు. కిషన్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ విూడియాలోనూ దుమారం రేపుతున్నాయి. అంతే కాదు ‘మా రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. మేం పార్టీలు మారిన వ్యక్తులం కాదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో పక్కనే ఉన్న రఘునందన్‌రావు ముఖంలో ఒక్కసారిగా హావభావాలు మారిపోయాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్‌,...