రానున్న రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు – భారత వాతావరణ శాఖ హెచ్చరిక

న్యూ డిల్లీ : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌, గుజరాత్‌, ఛత్తీస్‌ గఢ్‌, తెలంగాణ, ఒడిశా సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్‌ జారీ చేసింది.ఉత్తరాఖండ్‌ లోని ఏడు జిల్లాలు డెహ్రాడూన్‌, టెహ్రీ, పౌరీ, చంపావత్‌, ఉధమ్‌ సింగ్‌ నగర్‌, నైనిటాల్‌, హరిద్వార్‌ కు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ...