మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
నిజామాబాద్ : తెలంగాణ అకాడవిూ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వమించిన ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ గణేశ్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు...