మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు ?
బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చిన సందర్భంగా మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ కావాలా లేదా 24 గంటల నిరంతర విద్యుత్తు అందిస్తున్న సీఎం కేసీఆర్ కావాలా...