మణిపూర్ ఘటనపై సుప్రీం హెచ్చరిక – ప్రధాని ఆగ్రహం

మణిపూర్ లో కుకీలు, మొయిటీల మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేపి చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన మే 4నే జరిగినప్పటికీ దీని వీడియోలు మాత్రం నిన్న బయటికి వచ్చాయి. ఇవి కాస్తా వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రధాని మోడీ సహా సుప్రీంకోర్టు కూడా ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్లో రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి...