బియ్యం ఎగుమతులపై నిషేధం
ముంబై : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘బాస్మతీ ఏతర తెల్ల బియ్యం ఎగుమతుల నిబంధనలను సవరించాం. స్వేచ్ఛాయుత ఎగుమతుల్ని నిషేధిస్తున్నాం. ఇందులో పూర్తిగా మిల్లు పట్టిన, ఒక పోటు వరకే మిల్లు పట్టిన , పాలిష్ చేసిన, పాలిష్ చేయని బియ్యం ఉంటాయి’ అని డీజీఎఫ్‌టీ తెలిపింది.కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సాధారణ బియ్యం ఎగుమతులకు డీజీఎఫ్‌టీ అనుమతి ఇచ్చింది....