ప్రశ్నించే గొంతులకను అణచివేస్తారా..? అరెస్టుపై కిషన్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: ప్రశ్నించే గొంతులకను ప్రగతిభవన్లో కూర్చొని అణచివేస్తారా? అంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. ప్రజల ఆవేదన, ఆక్రోశం బీజేపీ నేతల అరెస్టులతో ఆగదన్నారు. ప్రజల తరపున బీఆర్ఎస్తో యుద్ధానికి తాము సిద్దమని కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రజల సమస్యల తరపున యుద్ధం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం మొదలైందని.. ఆ యుద్ధాన్ని మీరే(బీఆర్ఎస్) మొదలు పెట్టారని.. తాము సిద్ధంగా ఉన్నామని, శాంతియుతంగా యుద్ధం చేద్దామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రినే అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్మించిన...