టీఎస్ఆర్టీసీ సరికొత్త టూర్ ప్యాకేజ్: శ్రావణమాసం స్పెషల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. టీఎస్‌టీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం పలు పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోండటంతో మరిన్ని ప్యాకేజీలకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా- ఇదివరకు ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లు, ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రాలకు బస్సులను నడిపిస్తోంది టీఎస్ఆర్టీసీ. ఏపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలం, తమిళనాడులోని అరుణాచలానికి ఇప్పటికే స్పెషల్ బస్స్ సర్వీసులు, టూర్...