Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2024, 5:28 pm Posted by : ramakrishna

జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు కు సన్మానం

బతుకమ్మ, జుక్కల్ :-

జుక్క మండలం నూతనంగా వచ్చిన ఎస్సై భువనేశ్వర్ రావు కు జుక్కల్ మండల కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. నూతనంగా వచ్చిన ఎస్ఐ భువనేశ్వర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా  గంజాయి, గుట్కా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  అన్నారు. త్రివేణి సంగమం కావడంతో మహారాష్ట్ర. కర్ణాటక, తెలంగాణ, రాష్ట్రాల నుండి ప్రజలు రాకపోకలు చేస్తారని ఆయన అన్నారు. ఎక్కువగా ప్రజలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గ్రామాల్లో అడవి ప్రాంతాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠి తీసుకుంటామని ఆయన ఆదేశించారు. పేకాట రాయులు క్లబ్ నిర్వహిస్తే వారిపై కఠిన తీసుకుంటామని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు  తెలిపారు. ఇక్కడి ప్రజలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో నిత్యం  భజనలు పండర్పూర్ మారాజును దర్శించుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు సతీష్ పటేల్ జి, కౌలాస్ మాజీ సర్పంచ్ గొల్ల హన్మండ్లు, మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, కృష్ణ ఖండెబ్లాలూర్, రాజు, మాజీ సర్పంచ్ మాధవరావు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Congress leaders wishes Jukkal Si Bhuvaneshwar Rao