Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 2:53 pm Posted by : ramakrishna

గ్రామీణ అభివృద్ధికి విప్లవాత్మక మార్పు విబి-రామ్-జి చట్టం

. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి

 

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ – రోజ్ గార్ ఔర్ అజీవిక మిషన్ వి బి-రామ్-జి,నూతన చట్టం గ్రామీణ అభివృద్ధిలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ పేర్కొన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి, సామాన్య  ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. గతంలో ఉన్న మహత్మగాంది నరేగా పథకం కింద 100 రోజులు మాత్రమే పని కల్పించేవారు. కానీ ఈ నూతన చట్టం ద్వారా 125 రోజుల ఉపాధి లభిస్తుందని కోత్త చట్టం వల్ల గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమే అన్నారు. పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే వారికి నిరుద్యోగ భృతిచెల్లించే నిబంధనను ఈ చట్టంలో మరింత బలోపేతం చేశారు.గతంలో వేతనాల చెల్లింపులో జాప్యం జరిగేది, కానీ ఇప్పుడు ప్రతి వారం నేరుగా కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ వేతనాలు సరైన సమయానికి చెల్లించకపోతే, అదనపు పరిహారం (పరిహరం) చెల్లించే వెసులుబాటును కూడా ఈ చట్టంలో చేర్చారు అని గుర్తు చేశారు. వ్యవసాయ సీజన్లో కూలీల కొరత రాకుండా, విత్తులు,నాట్లు పంటకోత సమయాల్లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు అని పేర్కోన్నారు. గ్రామ పంచాయతీ ,గ్రామసభలే స్వయంగా తమ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం ఉందని గతంలో ఆ అవకాశం లేదన్నారు. ఈ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆధారిత పనులు ,విపత్తు నిర్వహణ వంటి నాలుగు రకాల పనులు చేపట్టనున్నారు. ఇందులో చెరువులు,చెక్ డ్యామ్, పా ఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, కాలువలు వంటి నిర్మాణాలతో పాటు మహిళా స్వయం సహాయక బృందాల ఆదాయాన్ని పెంచే పనులను కూడా చేర్చారు. ఆధార్ ,బయోమెట్రిక్ అనుసంధానం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు ఎప్పటికప్పుడు సామాజీక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని కోత్త చట్టంలో మార్పులతో గ్రామీణ పేధలకు ఉపాధి పెంచారు కాని తగ్గించలేదన్నారు. ప్రతిపక్షాలు రాజకీయంలోకి ఉపాధి హమీ పథకం ను లాగతున్నారని ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, నాయకులు ప్రమోద్, జ్యో తి, బద్దం కిసాన్, వీ రేందర్, ఓం సింగ్, ఇ ప్పకాయల కిషోర్, తారక్ వేణు,మాస్టర్ శంకర్,  బుర్గుల వినోద్, ఆమందు విజయ్ కృష్ణ,సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.