ఖర్చులు పెరిగిపోతే ఆర్థిక పరిస్థితి గాడి తప్పే ప్రమాదం ఉంది
ప్రణాళిక ప్రకారం పేదలను పేదరికం నుంచి బయటపడేలా కార్యక్రమాలు చేపడితే మంచిది. అంతేకానీ ఓట్లు తెచ్చుకునేందుకు అన్నట్లుగా పథకాలు సరికావు. ఇవి ప్రభుత్వంపై అప్పటికప్పుడు వచ్చిన వ్యతిరేకత తగ్గించవచ్చేమో గానీ, అప్పుల భారం పెరిగిపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఫిస్కల్ డెఫిషియట్ 25లోపు ఉండాలి. కానీ ఇప్పుడు అది పెరిగిపోయింది.’ నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ శివారుల్లోని భూములు వేలం వేస్తోంది ప్రభుత్వం. కోకాపేట, బుద్వేల్, షాబాద్, మోకిల ప్రాంతాలను ఎంచుకుంది. అలాగే మద్యం టెండర్ల...