ఎస్బీఐ ఎఫ్‌డీ.. పోస్టాఫీస్‌ టీడీ.. ఏది లాభం..

న్యూఢల్లీి : రిస్క్‌కు ఇష్టపడని ఇన్వెస్టర్లు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)కే తమ పోర్ట్‌ఫోలియోల్లో ఎక్కువ భాగాన్ని కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆకర్షణీయమైన ప్రతిఫలాలు, సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం, స్వల్ప`దీర్ఘకాలిక టెన్యూర్స్‌ వంటివి ఎఫ్‌డీలను సంప్రదాయ మదుపరులకు మరింత దగ్గరగా చేర్చుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను తీసుకొస్తున్నాయి. అయితే పోస్టాఫీస్‌ స్మాల్‌ సేవింగ్స్‌ స్కీం సైతం వివిధ కాలపరిమితుల్లో టైం డిపాజిట్ల (టీడీ) పేరిట ఎఫ్‌డీ పథకాలను అందిస్తున్నది. డిపాజిట్‌ కాలపరిమితినిబట్టి వీటిపై వడ్డీరేట్లుంటుండగా.. రిజర్వ్‌ బ్యాంక్‌...