ఎవరు రాజవుతారు? ఎవరు బంటు అవుతారు?
అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్-రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ అసెంబ్లీ వార్‌ను సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ అయిదు రాష్ట్రాల్లో విజయకేతనాన్ని ఎగురవేయడం ద్వారా సార్వత్రిక ఎన్నికలపై ఆధిపత్యాన్ని కనపర్చాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికి అనుగుణంగా...