ఎన్నికల నగారా మ్రోగించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బూతు స్థాయి కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నగారా మ్రోగించారు. బోధన్ పట్టణంలో ఐదు కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తల స్థాయి మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో, నియోజకవర్గంలో ఇప్పటివరకు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. దాదాపు 1800 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలలోకి వెళ్లాయని తెలిపారు. టిఆర్ఎస్ పాలనలో...