ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఆగస్టు నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. గత వారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది. పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 31న తెలంగాణ కేబినెట్ భేటీ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూలై 31వ తేదీ అంటే సోమవారం నాడు...